ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు మావోయిస్టులు హతం

by Shamantha N |
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు మావోయిస్టులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆరో విడత పోలింగ్ వేళ ఛత్తీస్‌గఢ్‌‌లో మరో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లాలోని మీర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకర్ అటవీప్రాంతంలో బస్తర్ డివిజన్ మావోయిస్టు ఇన్ ఛార్జ్ పాండ్రు సహా 15 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈక్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. స్పాట్‌ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక సుక్మా జిల్లాలోని బెల్‌పోచ్చా అటవీప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్‌లో ఒక మావోయిస్టు చనిపోయాడు. ఈ వివరాలను సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. ఈ ఘటనలతో కలుపుకొని ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 116కు చేరింది.

Next Story

Most Viewed