దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

by prasad |
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కార్నివాల్ ఫామ్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.అలిపూర్ ప్రాంతంలో ఉన్న ఈ కార్నివాల్ ఫామ్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టూరా వ్యాపించారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండగా చుట్టుపక్కల ఏమీ కనిపించనంతగా ఆ ప్రాంతం అంతటా దట్టమైన పొగ కమ్ముకుంది. ఘటన స్థలానికి అత్యంత సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయంతో వణికిపోయారు. దీంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కాగా విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Next Story

Most Viewed