రాహుల్‌పై పీకే కామెంట్స్‌.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదీ

by Hajipasha |
రాహుల్‌పై పీకే కామెంట్స్‌.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సంచలన సలహాలపై అంతటా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే.. పక్కకు తప్పుకొని వేరే వాళ్లకు దారివ్వాలని రాహుల్ గాంధీకి పీకే హితవు పలకడంపై భిన్నవిభిన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ టాపిక్‌పై కాంగ్రెస్ కూడా స్పందించింది. తాజాగా సోమవారం రోజు కాంగ్రెస్ మీడియా సమావేశం సందర్భంగా పీకే కామెంట్స్‌పై ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినతేను మీడియా ప్రశ్నించింది. ఆమె బదులిస్తూ.. ‘‘కన్సల్టెంట్ల వ్యాఖ్యలకు మేం సమాధానం చెప్పం.. రాజకీయ నాయకుల గురించి ఏదైనా ఉంటే చెప్పండి.. మాట్లాడుతాం.. కన్సల్టెంట్ల మాటలకు సమాధానం ఏమని చెప్పాలి?’’ అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed