హ్యాపీ బర్త్‌డే చందమామ బ్యూటీ.. సింధు మీనన్

by Jakkula Samataha |
హ్యాపీ బర్త్‌డే చందమామ బ్యూటీ.. సింధు మీనన్
X

దిశ, సినిమా : నేడు చందమామ సినిమాలో అల్లరి పిల్లగా నటించి, అందరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సింధు మీనన్. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు. ఈ అమ్మడు పేరు చెప్పగానే అందరికీ త్రినేత్రం, చందమామ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. సింధు మీనన్ 1985, జూన్ 17న బెంగుళూరులోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీ తెలుగులో 15 ఏళ్ల వయసులోనే భద్రాచలం, తమిళంలో ఉత్తమన్, మలయాళంలో సముత్తిరం అే సినిమాల్లో నటించింది. తర్వాత తెలుగులో చందమామ, శ్రీరామ చంద్రులు, ఇన్ స్పెక్టర్ , రెయిన్ బో, సిద్ధం, ప్రేమ పిలుస్తోంది వంటి సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు రాలేదు.

ఇక తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి ఏప్రిల్ 25,2010న తమిళనాడులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ ప్రభుని వివాహం చేసుకుంది. ఈమెకు ఓ కూమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. కాగా, నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు తన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.Next Story

Most Viewed