‘‘పెండ్లీ.. చావుకు ఒకే మంత్రమా’’

by  |
‘‘పెండ్లీ.. చావుకు ఒకే మంత్రమా’’
X

పెండ్లికి వచ్చి పెండ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నట్టుగా ప‌ల్లె ప్ర‌గ‌తి కోసం ఏర్పాటు చేసిన పంచాయ‌తీ స‌మ్మేళ‌న ఉద్దేశ్యం అర్ధం చేసుకోకుండా మునుగోడు ఎమ్మేల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం ప‌నిగా పెట్టుకుని మాట్లాడుతున్నాడ‌ని రాష్ట్ర మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం రాత్రి యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. అంత‌కు ముందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూసీ కాలుష్యం, బెల్టు షాపుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం గురించి తూర్పార ప‌ట్టాడు. ఆ సమయంలో స్పందించని మంత్రి.. రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పెండ్లికి.. చావుకు ఒకటే మంత్రం చదువుతారా..? అని ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ సమ్మేళనం కార్యక్రమం పెడితే వేరే విషయాలు మాట్లాడటం ఏంటని నిలదీశారు. పెండ్లికి వచ్చి పెండ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నట్టుగా ఉందన్నారు. రాష్ట్రం పూర్తిగా నాశనం అయిన తర్వాత తెలంగాణ ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు అని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆకలిచావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యంగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో పందులు, కుక్కలు దర్శనం ఇచ్చేవన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు.
ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి…
హైదరాబాద్‌లో నివాసముంటున్న వాళ్లు సర్పంచులుగా ఎన్నికయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సంచ‌ల‌న వ్యాక్యాలు చేశారు. సర్పంచులుగా గెలిచిన తర్వాత కూడా వాళ్లు హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, అధికారులు కూడా హైదరాబాద్‌లోనే ఉండ‌టం వ‌ల్ల గ్రామాభివృద్ది ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్సీ వ్యాక్యాల‌ను మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే సునీత త‌ప్పు ప‌ట్టారు. సర్పంచులు గ్రామాల్లోనే ఉంటున్నారని చెప్పారు. వాళ్ళను ఏమనవద్దని వ‌త్తాసు ప‌లుక‌డం వ‌ల్ల ఎమ్మెల్సీ ఖండించారు. దీంతో ఇరువురి మ‌ధ్య‌న స్వ‌ల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది.

Next Story