డేంజరస్ సెక్స్ ట్రెండ్

by Disha Web Desk |
డేంజరస్ సెక్స్ ట్రెండ్
X

దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ ఫాస్ట్ కల్చర్‌లో అపోజిట్ జెండర్స్ మధ్య చూపులు, మాటలు కలిశాయంటే చాలు.. సన్నిహిత సంబంధానికి దారితీసేందుకు ఎక్కువ సమయం పట్టదు. అలాగే ఆ రిలేషన్‌షిప్‌ను ఎక్కువ రోజులు మెయింటైన్ చేసేంత ఆసక్తి ఇద్దరికీ ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే 'వన్ నైట్ స్టాండ్' పేరుతో నచ్చిన వ్యక్తితో రొమాన్స్‌కు సిద్ధపడుతున్న మిలీనియల్స్.. తెల్లారితే ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారు. దీంతో ఇద్దరి మధ్య మ్యూచువల్ సెక్స్‌కు సంబంధించి కండోమ్ ధరించాలన్న నిబంధన తప్పనిసరి. కానీ కొందరు పార్ట్‌నర్స్ ఇతరత్రా ప్రయోజనాలు ఆశించి సరిగ్గా సెక్స్ సమయంలో భాగస్వామికి తెలియకుండా కండోమ్‌ తీసేస్తున్నారు లేదా దానికి చిల్లులు పెడుతూ ఇంటర్‌కోర్స్‌లో చిరిగిపోయేలా చేస్తున్నారు. దీన్నే స్టీల్‌థింగ్‌గా పిలుస్తుండగా.. ఈ డేంజరస్ ట్రెండ్ సెక్సువల్ రిలేషన్‌షిప్స్‌లో అనేక అనర్థాలకు కారణమవుతోంది.

శృంగారాన్ని ఆస్వాదించాలనుకున్న జంటలో ఒకరు.. తమ సెక్సువల్ పార్ట్‌నర్‌తో దీర్ఘకాలిక రిలేషన్‌షిప్ కోరుకోవచ్చు లేదా కండోమ్ లేకుండా సెక్స్‌ను ఆస్వాదించాలనే కోరిక కలిగి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కండోమ్‌‌కు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఇంటర్‌కోర్స్ సమయంలో చిరిగిపోయేలా చేస్తున్న కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. పురుష భాగస్వాములే కాక తమ సెక్సువల్ పార్ట్‌నర్‌ ద్వారా గర్భం దాల్చేందుకు మహిళలు కూడా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. తద్వారా సంబంధం కొనసాగించేలా బెదిరించేందుకు వారికి ఇదొక అస్త్రంగా ఉపయోగపడుతోంది. అయితే సేఫ్టీలెస్ సెక్స్ వల్ల అవాంఛిత గర్భాలతో పాటు లైంగిక సంక్రమణ వ్యాధులకు కూడా గురవుతున్నారు. ఒక్కోసారి ఇది హింసాత్మక లైంగిక చర్యలకు దారితీసి భావోద్వేగ, శారీరక, ఆర్థిక హానిని కలిగిస్తుంది. ఈ విషయంలో బాధితుల అనుభవాలు వింటే.. ఇది అత్యాచారంతో సమానమనే భావన కనిపిస్తోంది.

ప్రస్తుతం పలు దేశాల చట్టాలు దీన్ని రేప్‌గా పరిగణిస్తున్నప్పటికీ చాలా దేశాలు దీన్ని ఎలాంటి నేరంగా పరిగణించాలో తెలియక తికమకపడుతున్నాయి. ఇప్పటికే యూకే, స్విట్జర్లాండ్, కెనడా, జర్మనీ వంటి దేశాల్లో ఈ తరహా కేసులు వెలుగు చూడగా.. ప్రత్యేకించి న్యూజిలాండ్‌లో దీన్ని అత్యాచారంగా పరిగణిస్తున్నారు. ఇక గతంలో యూఎస్‌లోని స్విస్ కోర్టు కూడా ఈ తరహా కేసుకు సంబంధించి సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భాగస్వామికి చెప్పకుండా కండోమ్ తీసేసి సెక్స్‌లో పాల్గొ్న్న వ్యక్తిని రేపిస్టుగా నిర్ధారించింది. తను కండోమ్‌ తొలగిస్తిన్నట్లు ముందే తెలిస్తే ఆ మహిళ సెక్స్‌కు నో చెప్పేదని కోర్టు అభిప్రాయపడింది.

Next Story