నెగెటివ్ థాట్స్‌తో డిప్రెషన్.. జీవన శైలి మార్పులతో పరిష్కారం

by Disha Web Desk 10 |
నెగెటివ్ థాట్స్‌తో డిప్రెషన్.. జీవన శైలి మార్పులతో పరిష్కారం
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవన శైలి అనేక సమస్యలకు, అనారోగ్యాలకు కారణం అవుతోంది. అలాంటి వాటిలో మెంటల్ హెల్త్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ మధ్య చాలామందిని వేదిస్తున్న సమస్యల్లో ప్రతికూల ఆలోచనలు, దాని కారణంగా ఎదురయ్యే డిప్రెషన్ ఉన్నాయి. ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో నిరాశ, నిస్పృహలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చాలామంది వాటి నుంచి బయట పడుతుంటారు. కానీ మారుతున్న లైఫ్ స్టైల్, పెరుగుతున్న నెగెటివ్ థాట్స్‌ కొంతమందిని సూసైడ్ చేసుకునేలా కూడా ప్రేరేపించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగెటివ్ థాట్స్‌ను మీ మైండ్‌లోకి రానివ్వకండి అంటున్నారు మానసిక నిపుణులు. జీవన శైలిలో మార్పులతో వాటిని దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు.

టైమ్ ప్రకారం పనులు చేయండి

కొందరు చూద్దాం లే, చేద్దాం లే అని పనులు వాయిదా వేస్తుంటారు. దీనివల్ల అనుకున్న సమయానికి ఫలితాలు రాకపోవడంతో ప్రతికూల ఆలోచనలు వేధిస్తుంటాయి. కాబట్టి మీ దిన చర్య, ఇతర పనులన్నీ వీలైనంత మేరకు టైమ్ ప్రకారం చేసేలా చూసుకోండి. ప్రతిరోజూ ఉదయంపూట త్వరగా నిద్ర లేచే అలవాటు ఉన్న వ్యక్తులు డిప్రెషన్ బారిన పడ్డాక మారిపోతారు. త్వరగా లేవడానికి, బయటి ప్రపంచాన్ని చూడడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇలాంటి వ్యక్తులు తమ లైఫ్ స్టయిల్‌ను మార్చుకోవడం ద్వారా సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తే ప్రకృతిని, బయటి ప్రపంచాన్ని ఆస్వాదించడం వంటివి చేయాలి.

ఆత్మీయులతో సంభాషణ

నెగెటివ్ థాట్స్‌తో బాధపడేవారు తమకు ఇష్టమైన వ్యక్తులతో సంభాషించడంవల్ల మనసు కుదుట పడుతుంది. రిలాక్స్‌గా ఫీలవుతారు. మానసిక ఆందోళనలను డైవర్టు చేయడంలో ఆత్మీయులతో, ఇష్టమైన వ్యక్తులతో సంభాషణ అద్భుతంగా పనిచేస్తుందని మానసిక నిపుణులు కూడా చెప్తుంటారు. దీంతోపాటు నచ్చిన పుస్తకాలు చదవడం, ఫన్నీ వీడియోలు, కామెడీ సినిమాలు చూడటం వంటివి కూడా మీలోని ఆందోళనలు పోగొడతాయి.

పాజిటివ్ థాట్స్, ఎక్సర్‌సైజ్

నెగెటివ్ థాట్స్‌వల్ల డిప్రెషన్‌కు లోనైన వ్యక్తులు ఎప్పుడూ అదే మూడ్‌లో ఉండకుండా జాగ్రత్త పడాలి. తమ వ్యక్తిగత అవాట్లపై దృష్టి మరల్చడం ద్వారా కోలుకునే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వేధిస్తుంటే కాసేపు అద్దం ముందు నిలబడండి. మీ మొహం చూసుకుంటూ, తల దువ్వుకుంటూ మురిసిపోండి. మీరు అందమైన వ్యక్తులుగా ఊహించుకోండి. అందంగా ముస్తాబవ్వండి. ఇటువంటి చర్యలు కూడా ప్రతికూల ఆలోచనలను క్రమంగా దూరం చేస్తాయి. శారీరక, మానసిక సమస్యలను దూరం చేయడంలో వ్యాయామం ప్రముఖంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం యోగా లేదా మీకు నచ్చిన ఇతర వ్యాయామాలు చేయడంవల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. మీ మనస్సు బాధ‌లు, ఆందోళనల నుంచి డైవర్ట్ అవుతుంది. అంతేగాక మానసిక ఆందోళనలకు కొన్ని పోషకాల లోపం కూడా కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, మాంసం, పాలు, గుడ్లు వంటివి రెగ్యులర్ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ విధంగా తమ జీవన శైలిని మార్చుకోవడంవల్ల నెగెటివ్ థాట్స్‌ మీపై ఎటువంటి ప్రభావం చూపవు. జీవితం ఆనంద మయం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

సగ్గుబియ్యం తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

Next Story