కాంగ్రెస్ నాయకత్వం మారాలని కోరలేదు

by  |
కాంగ్రెస్ నాయకత్వం మారాలని కోరలేదు
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సమూల సంస్కరణలు చేపట్టాలని కోరుతూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖను తప్పుగా చిత్రీకరించారని సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద అన్నారు. ఆత్మ విమర్శ చేసుకుని పునరుత్తేజం పొందడానికి, సంస్కరణలు చేపట్టి పార్టీ పటిష్టంగా మారడానికి ఉద్దేశించి మాత్రమే తాము ఆ లేఖ రాశామని, నాయకత్వాన్ని తక్కువ చేయాలన్న అభిప్రాయమేమీ లేదని తెలిపారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ తాను ఈ విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జితిన్ ప్రసాద మాట్లాడుతూ, తనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై పూర్తి విశ్వాసమున్నదని, తనపైనా వారికి నమ్మకమున్నదని అన్నారు. సోనియాకు రాసిన లేఖపై యూపీ నుంచి కేవలం జితిన్ ప్రసాద మాత్రమే సంతకం పెట్టారు. యూపీ లఖింపుర్ జిల్లా కాంగ్రెస్ యూనిట్ జితిన్ ప్రసాద సహా 23 మంది అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

Next Story

Most Viewed