రేపటి నుంచి నిరక్షరాస్యుల సర్వే

by  |
రేపటి నుంచి నిరక్షరాస్యుల సర్వే
X

దిశ, హైదరాబాద్: ఈ నెల 24(సోమవారం) నుంచి మార్చి 04 వరకు పట్టణంలో నిరక్షరాస్యుల సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో కార్పొరేటర్లు, శాసన సభ్యులు ఉత్సాహoగా పాల్గొనాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. నగరంలోని 150 వార్డులను 5,704 ఆవాస ప్రాంతాలుగా గుర్తించి సర్వే బ్లాకులుగా విభజించినట్లు తెలిపారు. కోటి జనాభా ఉన్న పట్టణంలో.. సుమారు 24.78లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయని వివరించారు. అలాగే, వందశాతం ఇళ్లను సర్వే చేసేందుకు, పట్టణంలో ఉన్న 40 వేల స్వయం సహాయక సంఘాలు, 13 వందల స్లమ్ లెవెల్ ఫెడరేషన్లను సమాయత్తం చేశామని తెలిపారు. నిరక్షరాస్యుల వివరాల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించుటకు ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు సర్కిల్ స్థాయిలో శిక్షణనిచ్చినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Read also..

ప్రజల మధ్య బీజేపీ చిచ్చు: విపక్షాలు

Next Story