‘తమ్ముడు’ సినిమా నుంచి రాశీఖన్నా అవుట్.. నితిన్ సరసన కత్తిలాంటి ఫిగర్ ఫిక్స్!

by Hamsa |
‘తమ్ముడు’ సినిమా నుంచి రాశీఖన్నా అవుట్.. నితిన్ సరసన కత్తిలాంటి ఫిగర్ ఫిక్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి కథను ఎంచుకున్నప్పటికీ హిట్ పడకపోవడంతో.. ఈ సారి ఎలాగైన విజయం సాధించాలని బీష్మించుకూర్చున్న నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిట్ సినిమా ‘తమ్ముడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీని నుంచి విడుదలైన పోస్టర్స్ సినీ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.

ఇందులో హీరోయిన్‌గా రాశీఖన్నాను ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, తమ్ముడు సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులోంచి రాశీఖన్నా తప్పుకోవడంతో.. స్టార్ బ్యూటీ సప్తవి గౌడ‌ను సెలెక్ట్ చేశారని సమాచారం. కాంతారతో ఈ అమ్మడు ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగులోనూ పలు చిత్రాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. అయితే ఇప్పుడు తమ్ముడులో నితిన్ సరసన నటిస్తుండటంతో మూవీ హిట్ కొట్టడం పక్కా అని అంతా అనుకుంటున్నారు.

Next Story