యాసిడ్ పోసుకొని వ్యవసాయ ఉద్యోగి ఆత్మహత్య

by  |
యాసిడ్ పోసుకొని వ్యవసాయ ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యవసాయ ఉద్యోగి ఒంటిపై యాసిడ్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఉమదేవి కూమారుడు ఈ నెల 8న కరోనాతో మరణించాడు. అప్పటి నుంచి కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను పనిచేస్తున్న వ్యవసాయ శాఖ కార్యాలయంలోని భూసార పరీక్షాకేంద్రంలో ఒంటిపై యాసిడ్ పోసుకుంది. అనంతరం గట్టిగా కేకలు వేశారు. గమనించిన స్ధానికులు వెంటనే జీజీహెచ్ కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆమె మృతికి పోలీసుల వేధింపులే కారణమని విచారణ పేరుతో ఆమెను వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed