రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర..

by  |
రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర..
X

జేపీ,ఆర్ఎస్ఎస్‌‌లపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.దేశంలో రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కావున దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఎస్టీ,ఎస్టీ,ఓబీసీ రిజర్వేషన్లపైన చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, దీనిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని రాహుల్ పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ తప్పకుండా అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. అంతకుముందు రిజర్వేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కేంద్రం సమర్థిస్తుందని, లేనియెడల తమ వైఖరి ఎంటో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ప్రభుత్వాన్నినిలదీశారు. ఈ అంశంపైన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. సుప్రీం వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా చర్యలు చేపడితే ప్రజాగ్రహానికి గురవక తప్పదన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సుప్రీం వ్యాఖ్యలకు కేంద్రప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కాగా, సుప్రీం వ్యాఖ్యలు ఉత్తరాఖాండ్‌కు మాత్రమే పరిమితమని స్పష్టంచేశారు. ఇదిలాఉండగా ఉత్తరాఖాండ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలోనూ రిజర్వేష్లను అమలయ్యేలా చూడాలని వేసిన పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం రిజర్వేషన్లు ప్రాథమిక హక్కుకాదని తీర్పునిచ్చింది. వాటిని అమలు చేయలా, వద్దా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని అందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

Next Story