కేసీఆర్‌వి దొంగ మాటలు.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం

by  |
CPM leader Julakanti Rangareddy
X

దిశ, నల్లగొండ: అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని, స్థలం ఉన్న ప్రతిపేద వారికీ ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలక్టరేట్ ఎదుట రీటే నిరాహార దీక్ష చేపట్టారు. గరువారంతో ఈ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో జూలకంటి రంగారెడ్డి పాల్గొని, మద్దతు తెలిపిన జూలకంటి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నా.. పట్టణంలో పేదలకు ఇంతవరకు ఒక్క ఇళ్లూ ఇవ్వలేదని ఆరోపించారు. నిర్మించిన 552 ఇండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. పట్టణంలో పదివేల మంది దరఖాస్తులు చేసుకున్నారని వెంటనే సర్వే నిర్వహించి అర్హులకు ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ప్రజలకు సంబంధించిన భూములను అప్పనంగా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులతో ‘దళితబంధు’ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మేల్కొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ఎండీ సలీం, అద్దంకి నర్సింహ, కమిటీ సభ్యులు ఊటుకూరి నారాయణరెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, గాదె నరసింహ, భూతం అరుణకుమారి, గుండాల నరేష్, గడగోజు శ్రీనివాసచారి, సలీమ్, పాలాది కార్తీక్, కుంభం లక్ష్మమ్మ, సీత వెంకటయ్య, భాషపాక గణేష్, చిట్టిప్రోలు వెంకటేశం పాల్గొన్నారు.

Next Story

Most Viewed