చైనాపై మెతకవైఖరెందుకు? : రణదీప్ సూర్జేవాలా

by  |
చైనాపై మెతకవైఖరెందుకు? : రణదీప్ సూర్జేవాలా
X

దిశ, వెబ్ డెస్క్ : పక్కలో బెళ్లెంలా తయారైన చైనాపై మాట్లాడేందుకు భారత ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని.. వారి పట్ల అంత మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రధాని మోడీని ప్రశ్నించారు. శనివారం దేశప్రజలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ.. చైనాను నిలువరించడానికి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దేశప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా, 137కోట్లకు పైగా భారతీయులు మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నారని, వారి పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని గుర్తుచేశారు. కానీ, ప్రజాస్వామ్యం అంటే మొదట బీజేపీ సర్కార్కు నమ్మకం ఉందా, ప్రజా అభిప్రాయాలకు ఈ ప్రభుత్వం విలువనిస్తుందా అని మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం మాట్లాడడానికి గానీ, ప్రయాణించడానికి గానీ స్వేచ్ఛ లేకుండా పోయిందని.. అసలు మనం ఏలాంటి దుస్తులు ధరించాలో ఆ విషయంలో నైనా మనకు ఫ్రీడమ్ ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story