'కేసీఆర్ పుట్టడం తెలంగాణ అదృష్టం.. ఆయన పుట్టిన గడ్డపై నేను పుట్టడం నా అదృష్టం'

by  |
కేసీఆర్ పుట్టడం తెలంగాణ అదృష్టం.. ఆయన పుట్టిన గడ్డపై నేను పుట్టడం నా అదృష్టం
X

దిశ, కరీంనగర్: తెలంగాణా గడ్డపై కేసీఆర్ జన్మించడం ఇక్కడి ప్రజల అదృష్టం అయితే ఆయన పుట్టిన గడ్డపై తాను పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… దేశం ఆకలి తీర్చేవిధంగా సీఎం కేసిఆర్ తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. ఆరేళ్లలో సీఎం కేసిఆర్ తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనకుండా ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నేతలు ప్రజలను అవమానించారని విమర్శించారు. తెలంగాణ రావడం కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఇష్టం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో సీఎం కేసిఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబదుతుందన్నారు.

Next Story