సెన్సేషన్ న్యూస్.. బిగ్‌బాస్-7 విన్నర్, రన్నర్ ఎవరో చెప్పేసిన వికీపీడియా..?

by sudharani |
సెన్సేషన్ న్యూస్.. బిగ్‌బాస్-7 విన్నర్, రన్నర్ ఎవరో చెప్పేసిన వికీపీడియా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. 14 మందితో స్టార్ట్ అయిన ఈ సీజన్.. ఐదుగురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌస్‌లో పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్, ప్రియాంక, అర్జున్ ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విన్నర్, రన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఆ విషయాల్లోకి వెళితే..

భారీ అంచనాలతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 6 కంటెస్టెంట్స్ (పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్, ప్రియాంక, అర్జున్ ) ఫైనలిస్టులుగా ఫిక్స్ అయ్యారు. అయితే.. చివరి ముగ్గురు ఎలిమినేషన్ శనివారం జరగనుండగా.. టాప్ 3 కంటెస్టెంట్లలో విన్నర్, రన్నర్‌ను మాత్రం ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లోనే ప్రకటించననున్నారు. ఇక ఇప్పటికే ఫినాలేకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విన్నర్ విషయంలో ఇప్పటికే సర్వేలు జరగ్గా.. శివాజీ, ప్రశాంత్, అమర్‌ల పేర్లు వినిపించాయి. వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు టైటిల్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఉత్కంఠ బరితమైన సందర్భంలో విన్నర్, రన్నర్ పేర్లతో వికీపీడియాలో డిటైల్స్ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

వికీపీడియాలో లీకైన సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఫినాలేకు ఇంకా కొన్ని గంటలే సమయం మాత్రమే ఉంది. అయితే.. ఎలాంటి సమాచారం ఇంకా బయటకు రాకముందే.. విన్నర్‌గా పల్లవి ప్రశాంత్, రన్నర్‌గా శివాజీ ఉన్నట్లు వికీపీడియాలో లీక్ అయిపోయింది. దీని ప్రకారం సీజన్ 7లో ప్రశాంత్ విజయం సాధిస్తాడట. అయితే.. అఫిషియల్‌గా విన్నర్, రన్నర్ పేర్లు అనౌన్స్ చేయకముందే.. వికీపీడియాలో విన్నర్, రన్నర్ పేర్లను ముందే యాడ్ చేయడంతో పెద్ద సెన్సేషన్‌గా మారింది. దీంతో వికీపీడియాలో సమాచారాన్ని డిలీట్ చేశారు. అయినప్పటికీ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఈ స్క్రీన్ షాట్ ఒరిజినల్‌లో కాదో తెలియదు కానీ.. SPY ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. కాగా.. విన్నర్, రన్నర్‌పై కొన్ని గంటల్లోనే క్లారిటీ రానుంది. అప్పటివరకు బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూడాల్సిందే.

Next Story

Most Viewed