గోడ మీదపడి బాలిక మృతి

by srinivas |
గోడ మీదపడి బాలిక మృతి
X

దిశ, తణుకు: రోడ్డుపై నడిచి వెళుతుండగా ఆకస్మాత్తుగా గోడ కూలిన ఘటనలో ఐదేళ్ల చిన్నారి చిక్కా విజయలక్ష్మి మృతి చెందింది. ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన విజయలక్ష్మి తల్లి వేణితో పాటు బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి స్వగ్రామం వెళ్లే క్రమంలో 19వ వార్డులో రూట్స్ స్కూల్ సమీపంలో నడిచి వెళుతుండగా శిథిలావస్థకు చేరిన గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో చిన్నారి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed