విషాదం.. ప్రేయసి ఆత్మహత్య తట్టుకోలేక గొంతు కోసుకున్న ప్రియుడు

by Mahesh |
విషాదం.. ప్రేయసి ఆత్మహత్య తట్టుకోలేక గొంతు కోసుకున్న ప్రియుడు
X

దిశ, బయ్యారం: ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో యువకుడు గొంతు కోసుకున్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బయ్యారం మండలంలోని కోటగడ గ్రామ పంచాయతీ చెందిన కొట్టెం రవళి 23 సంవత్సరాలు కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి ప్రేమికుడి నివాసంలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. మృతురాలికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరగగా భర్తతో విడిపోయి వేరు గా ఉంటూ తన జీవనాధారం కోసం భువనగిరిలో యువతి తల్లిదండ్రులు పని చేసే కోళ్ల ఫారం లో పని చేసుకుంటుంది. అక్కడే పనిచేస్తున్న యువతి గ్రామానికి చెందిన యువకుడు రాఘవేందర్ పరిచయమై తర్వాత ప్రేమగా మారి మారినట్లు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త కుల పెద్దలతో పంచాయతీ పెట్టే క్రమంలో ఈ ప్రేమ జంట వారి సొంత గ్రామం కోడగడ గ్రామానికి గత మూడు రోజుల క్రితం వెళ్లారు. అయితే కుటుంబ కలహాల తట్టుకోలేక ఆ మహిళ ప్రియుడి ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చెందినట్లు తెలిపారు. మృతురాలి సంఘటన చూసిన ప్రేమికుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మ యత్నానికి పాల్పడగా, తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య ఉండటంతో స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎస్ఐ ఉపేందర్ వివరణ కోరగా యువతి ఆత్మహత్య సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి మొదటి భర్త బందువులు కేసు పెట్టగా భువనగిరి పిఎస్‌లో అక్కడ కేసు నమోదుచేసినట్లు తెలిసిందని తెలిపారు.Next Story

Most Viewed