అక్కడ నుంచి నేనే పోటీ చేస్తా.. జనసేన నేత పోతిన మహేశ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
అక్కడ నుంచి నేనే పోటీ చేస్తా.. జనసేన నేత పోతిన మహేశ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన నేత పోతిన మహేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న ఆయన వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్టులోనే తన పేరు వస్తుందనే ఆశలు పెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆయన పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఈ మేరకు పోతిన మహేశ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపున తాను పోటీ చేస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయానని, కానీ ఈసారి కచ్చితంగా గెలుస్తానని పోతిన మహేశ్ ధీమా వ్యక్తం చేశారు.

విజయవాడ వెస్ట్‌లో సమస్యలపై తాను చాలా పోరాటాలు చేశానని పోతిన మహేశ్ చెప్పారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి చేసి అవినీతి, అక్రమాలే తనను గెలిపిస్తాయని పోతిన మహేశ్ పేర్కొన్నారు. విజయవాడ వెస్ట్‌లో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తనకు టికెట్ ఇస్తే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ఓడిస్తానని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ మాజీ మంత్రి జలీల్ కలవడంలో తప్పేమీ లేదని చెప్పారు. టికెట్ల కోసం చాలా మంది ఆశిస్తుంటారని, తమ అధినేత పవన్ త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తారని, అంతా మంచే జరుగుతుందని పోతిన మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. .

Next Story

Most Viewed