హైకోర్టులోనూ నిరాశే : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Disha Web Desk 21 |
హైకోర్టులోనూ నిరాశే : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని కోర్టులో నిరాశే ఎదురైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో కానీ ఏపీ హైకోర్టులోగానీ ఊరట లభించలేదు. చివరకు సుప్రీంకోర్టులోనూ నిరాశే ఎదురైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ చంద్రబాబు నాయుడును నిందితుడిగా సీఐడీ పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. దీనిపై ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29కు వాయిదా వేసింది. ఇకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుతోపాటు నారా లోకేశ్, మాజీమంత్రి పి.నారాయణలను నిందితులుగా సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేశ్‌ను ఏ-14గా నమోదు చేసింది. దీంతో నారా లోకేశ్ సైతం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Read More Latest updates of Andhra Pradesh News

Next Story