సీఎం జగన్ బిగ్ స్కెచ్.. ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ ఎమ్మెల్యే

by Disha Web Desk 16 |
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ దూకుడు పెంచారు. వైనాట్ 175 నినాదంతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా భారీ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేనను చావు దెబ్బ కొట్టాలని అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేయించిన సీఎం జగన్.. నెగిటివ్ రిపోర్టు వచ్చిన చోట్ల ఇంచార్జులను మార్చుతున్నారు. అలా చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులకు కాదని ఇంకొకరికి అవకాశం కల్పించారు. కానీ జనసేన నుంచి వచ్చిన ఏకైన ఎమ్మెల్యే రాపాకకు మాత్రం భారీ గుడ్ న్యూస్ తెలిపారు. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఎమ్మల్యేగా గెలిచిన ఆయనను ఈసారి అమలాపురం ఎంపీలో ఉంచనున్నట్లు తెలుస్తోంది.


ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వంపై సీఎం జగన్ ఇప్పటికే పరిశీలించారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అమలాపురం ఎంపీగా చింతా అనురాధ ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వడంలేదనే ప్రచారం జరుగుతోంది. ఆమె స్థానంలో రాపాక వరప్రసాద్‌ను ఎన్నికల బరిలో ఉంచాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Also Read..

పవన్ కల్యాణ్‌పై కొడాలి నాని పాజిటివ్ కామెంట్స్.. జనసైనికులకు కీలక విజ్ఞప్తి

Next Story