సంక్షేమం కాదు రాజ్యాధికారం కావాలి- జన అధికార సమితి

by  |
samithi
X

దిశ, ఖైరతాబాద్ : బీసీలు సామాజిక న్యాయం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి రాజ్యాధికారం దిశగా ఉద్యమం చేపట్టాలని జన అధికార సమితి మార్గదర్శకులు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో జన అధికార సమితి అధ్యక్షుడు చీరాల నారాయణ అధ్యక్షతన బీసీ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి 75 కులసంఘాల ప్రతినిధులు హాజరై బీసీల స్థితిగతులపై సమగ్రంగా చర్చించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరహరి మాట్లాడుతూ, రాజకీయ పార్టీలను పక్కనపెట్టి రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాలు ఐక్యంగా పోరాడాలని సూచించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలలో వెనుకబడి ఉన్న ఈ వర్గాలకు చేయూతనందించేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. అన్ని బలహీన వర్గాలు ఒకే తాటిపై వచ్చినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని, అందుకోసం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, నాయకులు రమేష్ బాబు, రాజేందర్, ఎం శ్రీనివాస్, కె నాగార్జున, కే తిరుపతి, మహేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed