నా ప్రేమను అర్థం చేసుకొని.. తిరిగి ఇవ్వండి అని వేడుకుంటున్న నాగచైతన్య.. పాపం ఎంత కష్టపడుతున్నాడో (వీడియో)

by Hamsa |
నా ప్రేమను అర్థం చేసుకొని.. తిరిగి ఇవ్వండి అని వేడుకుంటున్న నాగచైతన్య.. పాపం ఎంత కష్టపడుతున్నాడో (వీడియో)
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనిని చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా.. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. అక్కినేని ఫ్యామిలీకి చెందిన వారు కలిసి నటించిన ‘మనం’ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య, నాగార్జున, అమల, అఖిల్, నాగేశ్వరరావు, సమంత, శ్రియ నటించారు. అయితే ఈ చిత్రాన్ని మళ్లీ పలు చోట్ల స్పెషల్ షోలుగా వేస్తున్నారు. దీంతో నాగచైతన్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. మనం డైలాగ్స్ చెబుతున్న వీడియో ఒకటి నెట్టింట అందరినీ ఆకట్టుకుంటుంది.

దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ వారు యూట్యూబ్ ద్వారా షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. ఇందులో నాగచైతన్య.. ‘‘నా ప్రేమని అర్థం చేసుకోండి. మీ ప్రేమను నాకు తిరిగి ఇవ్వండి. ప్రేమను మీరు ఎంత ప్రేమించారో అంతకంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. ప్రేమను ప్రేమగా చూసుకుంటాను’’ అంకుల్ అని వేడుకుంటూ కనిపించాడు. అయితే ఈ డైలాగ్ చెప్పడానికి నాగచైతన్య తెగ కష్టపడిపోయాడు. అయినప్పటికీ సరిగ్గా రాకపోవడంతో నావల్ల కావట్లేదని చెప్పి బాయ్ చెప్పి వెళ్లిపోతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.

Next Story

Most Viewed