చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ఓడిపోయాం : కేటీఆర్

by Kalyani |
చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ఓడిపోయాం : కేటీఆర్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో తాము స్వల్ప తేడాతో ఒటమి పాలయ్యామని, కాని దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకనే ఓటమి చెందామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని‌ ఆదివారం భువనగిరి పట్టణంలో భువనగిరి నియోజకవర్గ‌ విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పుకోలేక ఓటమి చెందమన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ను పూర్తిగా తరలికొట్టామని, నిరంతర విద్యుత్ అందించామని, రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండించే జిల్లాగా నల్గొండ రూపుదిద్దుకుందని, జిల్లాకు మూడు మెడికల్ కళాశాలలను అందించామని, జిల్లాలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించామని, యాదాద్రి ఆలయాన్ని ప్రపంచంలోనే సరికొత్తగా నిర్మించామని ఇలాంటి గొప్ప పనులను తాము ప్రజల్లోకి తీసుకు వెళ్లకుండా ఓటమి చెందామన్నారు. ఉద్యోగులకు 73% జీతాలు పెంచామని, ఫిట్మెంట్ అందిచామని కానీ మొదటి తారీకు జీతం పడని విషయాన్ని ప్రత్యర్ధులు బలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారని చెప్పారు. గత పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.

విద్యావంతుల సమస్యలను లేవనెత్తగా దానికి ఒక అర్హుడైన వ్యక్తి అవసరం ఉందని దానికోసమే అమెరికా బిట్స్ పిలానీలో చదువుకున్న విద్యావేత్త రాకేష్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినట్లు చెప్పారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, స్టాండప్ ఇండియా చేస్తామని, రైతుల ఆదాయం డబల్ చేస్తామని అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గుడి నిర్మించామని చెప్పి ఓట్లు అడుగుతున్నారని, అలాంటిది కేసీఆర్ కూడా యాదాద్రి ఆలయాన్ని బ్రహ్మాండంగా పునర్నిర్మానం చేశాడని చెప్పారు.

దీంతో పాటుగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అనేక ప్రాజెక్టులకు దేవతల పేర్లు పెట్టి తన భక్తిని చాటుకున్నాడని అన్నారు. తాను సీఎం అవగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా చేయకపోవడం మోసం అన్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరోసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజలకు మాయమాటలు చెబుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు దాని గురించి స్పందన లేదన్నారు. 400 ఉన్న టెట్ పరీక్ష ఫీజును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2000 చేసిందన్నారు.

ఇప్పటివరకు ఎన్ని జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ మెగా డీఎస్సీ ఏది అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు చెప్పుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారని అన్నారు‌. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఉప ఎన్నికల్లో గెలుస్తున్నామని, ఓటర్లు అన్ని ఆలోచించి ఓటయ్యాలని సూచించారు.‌ రాకేష్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చాడని, ఇలాంటి వ్యక్తిని విద్యావేత్తలు ఆదరించాలన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్, సొల్లు కబుర్లు చెప్పే వ్యక్తి అని కాబట్టి ఆలోచన చేసి ఓటు వేయాలని‌ పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి‌ మాటాడుతూ …కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా దుర్మార్గంగా వ్యవహరించి ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం చేసిందన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిందని దేశంలో చాలామందికి ఒక్క పూట కూడా తిండి దొరకకుండా పేదరికం పెరిగిందన్నారు. పక్క రాష్ట్రం బిక్షం ఎత్తకుంటుందని దేశ ప్రధాని మోడీ అంటున్నారని, పక్క దేశం గురించి అలా మాట్లాడడం ఎందుకన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, పార్టీ నాయకులు చింతల వేంకటేశ్వర రెడ్డి, గిల్లు శ్రీనివాస్, తుంగ బాలు, కోనపురి కవిత, ముఖ్య నాయకులు. కార్యకర్తలు. నియోజకవర్గ స్థాయి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed