పాలేరులో ‘బోటు’ పాయే.. పర్యాటకులు తిరిగి చూడరాయే..!

by  |
boat
X

దిశ, పాలేరు : కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయంలో పర్యాటక బోటు నీట మునిగింది. పర్యాటకులను ఆకర్షించే నేపథ్యంలో ఆ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బోటు షికారు మూణ్నాళ్ల ముచ్చటగానే సాగడంతో పర్యాటక ప్రియులు పెదవి విరుస్తున్నారు. గత రెండు వారాలుగా బోటు నీటిలోనే ఉందిపోయింది. అయితే, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద రావడంతో పాటు, సాగర్ జలాలు 1796 క్యూసెక్కుల కూడా చేరి పాలేరు రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తూ మత్తడి పోస్తోంది. దీంతో జలాశయం ఒడ్డున ఉన్న బోటు రెండు వారాలుగా మునిగిపోయింది. ప్రస్తుతం పాలేరు జలాశయం నీటి మట్టం 23 అడుగుల దాటడంతో ఫాలింగ్ గేట్లు ఆటోమేటిక్‌గా పడిపోయి లోతట్టు ప్రాంతానికి నీరు ప్రవహిస్తుంది. దీంతో గతంలో పర్యాటక శాఖ నుంచి రూ.16 లక్షల అంచనా వ్యయంతో 2018 ఆగస్టులో పాలేరు జలాశయంలో ఆనాటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ టూరిస్టు బోటును ప్రారంభించారు. పర్యాటకుల కోసం ఫుడ్ కోర్ట్ సైతం ఏర్పాటు చేయించారు. టూరిస్టులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రతిపాదనలు సైతం పంపారు. ఈ ప్రక్రియ అంతా కొన్నాళ్ళు సజావుగానే సాగినా.. పర్యాటక శాఖ అజమాయిషీలో నిర్లక్ష్యం కారణంగా బోటు మునిగిపోవడంతో షికారు లేక పర్యాటకుల తాకిడి తగ్గింది.

అయితే, తెలంగాణ ప్రభుత్వం పర్యాటక ప్రాంతమైన పాలేరును నిర్లక్ష్యం చేయడంతో పాలేరు పర్యాటక ప్రాంతం పర్యాటక ప్రేమికులను ఆకర్షించలేక మసకబారింది. జిల్లా పర్యటక శాఖ అధికారి ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాలేరు గ్రామానికి చెందిన కొంతమంది గంగపుత్ర యువజన సంఘం పేరుతో ఈ బోర్డును కొద్దికాలం పాటు నడిపించారు. కానీ, అనుకున్న మేర పర్యాటకంగా డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పటికైనా లక్షలు పోసి కొన్న విలువైన ఓటును పర్యాటక శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి.. నీటి నుంచి బయటకు తీసి పర్యాటకులకు అందుబాటులో ఉంచేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు.

బోటును వెలికి తీసేందుకు సాధ్యపడటం లేదు..

గంగ పుత్రుల వినతి మేరకు పాలేరు జలాశయం నీటి మట్టం తగ్గించేందుకు శనివారం 15 గేట్లు, ఆదివారం మరో మూడు గేట్లు ఎత్తినట్లు తెలిపారు. కానీ వరద ఎక్కువగా ఉన్నందున గరిష్ట నీటి మట్టమే కొనసాగుతుందన్నారు. బోట్‌ను వెలికి తీసేందుకు సాధ్యపడడం లేదని గంగపుత్ర సభ్యులు తెలిపినట్లు వివరించారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె వివరించారు.

-రత్న కుమారి, ఇరిగేషన్ డీఈ

tourist boat sunk in paleru river

Next Story

Most Viewed