- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిటైర్డ్ ఉద్యోగికి 4 వారాల్లో పెన్షన్ చెల్లించాలి.. లేదంటే 18% వడ్డీ! రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు వార్నింగ్
రిటైర్డ్ ఉద్యోగి విజయకుమార్‌కు 4 వారాల్లోగా పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని, లేనిపక్షంలో 18% వడ్డీ చెల్లించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్: రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాల (Retirement benefits) చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించి ఆరు నెలల క్రితం రిటైర్ అయిన విజయ్ కుమార్ అనే ఉద్యోగికి రావాల్సిన రూ. 90 లక్షల బెనిఫిట్స్ ఇంకా అందలేదు. దీనిపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, తెలంగాణ ప్రభుత్వ (Telangana Govt) తీరును తప్పుబడుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి (Principal Secretary, Finance Department) కఠిన ఆదేశాలు జారీ చేసింది.
విజయకుమార్‌కు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను రాబోయే 4 వారాల్లోగా పూర్తిస్థాయిలో చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ చెల్లింపులు జరగకపోతే, టోకెన్ జారీ చేసిన తేదీ నుంచి 18 శాతం వార్షిక వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వృద్ధాప్యంలో తమ కష్టార్జితం కోసం ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగడం సరికాదని, తక్షణమే ఈ బకాయిలను విడుదల చేయాలని న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశించింది.
కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట.. పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు
దుస్తుల కాంట్రాక్టులు ‘టెస్కో’కే ఇవ్వండి.. PMU నోటిఫికేషన్‌ను రద్దు చేసిన హైకోర్టు
పీసీ ఘోష్ రిపోర్టును చెత్తబుట్టలో వేయొచ్చు.. KCR తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు






