- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట.. పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు
కాళేశ్వరం నివేదిక అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice P.C. Ghosh Commission) నివేదిక అంశంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం కాళేశ్వరం ఎత్తిపోతలపై కమిషన్ ఏర్పాటను సమర్థిస్తూ.. అది చట్టబద్ధమేనని తెలిపింది. ఇక నివేదిక తయారుచేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. సెక్షన్ - 8 కింద నోటీసులు ఇవ్వకుండా నిరాధర ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని తెలిపింది. నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీకోవద్దని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసులో పిటిషన్లు దాఖలు చేసిన మాజీ సీఎస్ ఎస్కే జోషీతో పాటు నాటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు కూడా ఊరట లభించినట్లైంది.
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. తమ క్లయింట్లను నివేదిక రూపొందించే సమయంలో సాక్షులుగానే వివరాలు అడిగారని కోర్టుకు తెలిపారు. తీరా చూస్తే.. తన క్లయింట్లు తప్పు చేసినట్లుగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ -1952 (సెక్షన్-8B) (సెక్షన్-8C) ప్రకారం.. ఎవరినైనా సాక్షులుగా విచారించినప్పుడు వారిపై ఎలాంటి అభియోగాలు మోపకూడదని గుర్తు చేశారు. ఒకవేళ ఆ అభియోగాలు నిజమైతే వేరుగా ఒక్కోక్కరికి నోటీసు విచారించాల్సి ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.
కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించి బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో నెం.6 సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్కే జోషిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌న్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ మేరకు కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు కూడా కోర్టు ఊరట కల్పించింది.
దుస్తుల కాంట్రాక్టులు ‘టెస్కో’కే ఇవ్వండి.. PMU నోటిఫికేషన్‌ను రద్దు చేసిన హైకోర్టు
పీసీ ఘోష్ రిపోర్టును చెత్తబుట్టలో వేయొచ్చు.. KCR తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు






