రాజేందర్ రెడ్డి మృతికి కారకులను అరెస్ట్ చేయాలని ఆందోళన

by Ratna Kumari |

రాజేందర్ రెడ్డి మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కరీంనగర్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

రాజేందర్ రెడ్డి మృతికి కారకులను అరెస్ట్ చేయాలని ఆందోళన
X

దిశ, తిమ్మాపూర్ : గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డి మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కరీంనగర్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వంగల మురళీధర్ రెడ్డి, ఎండి.సాదిక్, వంగల రవీందర్ రెడ్డి, పైడిమల్ల మల్లేశం, బిగుల్ల శ్రవణ్‌లపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108, 3(5) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే వరకు ఆందోళన విరమించేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దగా, వారు ఆందోళనను విరమించినట్లు సమాచారం. పోస్టుమార్టం అనంతరం రాజేందర్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన గన్నేరువరానికి తరలించినట్లు తెలిసింది.

Next Story