WTC 2027 ఫైనల్ వేదిక ఇదే..మ్యాచ్ ఎప్పుడంటే ?

by velandi.Saikiran |

WTC 2027 ఫైనల్ వేదికతో పాటు షెడ్యూల్ ఖ‌రారు అయింది.

WTC 2027 ఫైనల్ వేదిక ఇదే..మ్యాచ్ ఎప్పుడంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లండన్ లోని హిస్టారికల్ ది ఓవల్ మైదానంలో నిర్వహించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం.. 2027 సంవత్సరం... జూన్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మ్యాచ్‌ నిర్వహించనున్నారు.

అంటే సరిగ్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు ఏడాది సమయం ఉంది. 2027, 2029, 2031 నిర్వహణ హక్కులను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దక్కించుకుంది. ఈ క్రమంలోనే ECBకి ఆ బాధ్యతలు అప్పగించింది ఐసీసీ. WTC పాయింట్ల పట్టిక ప్రకారం మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా, ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా ఉన్నాయి. మరి ఇందులో ఫైనల్ మ్యాచ్ ఏ జ‌ట్ల‌ మధ్య జరుగుతుందో చూడాలి. భారత జట్టుకు కేవలం 48.15% ఫైనల్ ఆడే ఛాన్సులు ఉన్నాయి.

Next Story