పీక‌ల్లోతు క‌ష్టాల్లో జింబాబ్వే...స‌గం వికెట్లు డౌన్

by velandi.Saikiran |

పీక‌ల్లోతు క‌ష్టాల్లో జింబాబ్వే ప‌డింది. భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు స‌గం వికెట్లు డౌన్ అయ్యాయి.

పీక‌ల్లోతు క‌ష్టాల్లో జింబాబ్వే...స‌గం వికెట్లు డౌన్
X

దిశ‌, వెబ్ డెస్క్: హరారే వేదికగా జరుగుతున్న మొదటి టీ20 లో పీకల్లోతు కష్టాల్లో పడింది జింబాబ్వే. భారత బౌలర్ల దెబ్బకు విలవిలలాడిపోతోంది. ఇప్పటి వరకు 15 ఓవర్లు ఆడిన జింబాబ్వే, 77 పరుగులు చేసి ఐదు వికెట్లు నష్టపోయింది. టాప్ ఆర్డర్ మొత్తం విఫలం కావడంతో.. ఈ పరిస్థితి నెలకొంది. అటు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కూడా నాలుగు పరుగులు చేసి విఫలం అయ్యాడు. కొత్తగా వచ్చిన మయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా... ప్రిన్స్ యాదవ్, రవి , శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. పరిస్థితి చూస్తుంటే, జింబాబ్వే సెంచరీ కూడా దాటేలా కనిపించడం లేదు.

Next Story