- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీచర్ గా మారిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ హరిత పాఠశాల తనిఖీ వెళ్లి టీచర్ గా మారి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు.

దిశ, ఆసిఫాబాద్ : జిల్లా కలెక్టర్ హరిత పాఠశాల తనిఖీ వెళ్లి టీచర్ గా మారి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. విద్యార్థులతో మమేకమై పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను చాక్లెట్లు అందించి అభినందిస్తూ మరింత ఉత్సాహపరిచారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం వంటశాలను తనిఖీ చేసి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. తాగునీటి సౌకర్యం, తరగతుల నిర్వహణ, విద్యాబోధన పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థినిని తొమ్మిదో ఎక్కం (9 టేబుల్) చెప్పమని అడగగా, ఆమె గడగడా చదివి వినిపించడంతో కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యా నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో బోధించాలని సూచించారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అన్నిమౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.






