- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Email Apnea.. జెన్ Zలో పెరుగుతున్న ఆ సమస్య!
పని ఒత్తిడిలో మన నాడీ వ్యవస్థ కొన్నిసార్లు ఇ-మెయిల్‌ను కూడా ఒక హెచ్చరిక సంకేతంగా భావిస్తుంది. శరీరాన్ని టెన్షన్ మోడ్‌లోకి నెడుతుంది.

దిశ, ఫీచర్స్ : కంప్యూటర్ కీబోర్డుపై ఏదైనా టైప్ చేస్తున్నప్పుడో, ఇ-మెయిల్ చదువుతున్నప్పుడొ, వాట్సాప్ మెసేజెస్‌కి రిప్లై ఇస్తున్నప్పుడో మీరు అనీజీగా ఫీలవుతున్నారా? అప్రయత్నంగానే శ్వాస కొన్ని క్షణాలపాటు ఆగిపోవడం లేదా చాలా స్లోగా ఊపిరి తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు ‘ఇ-మెయిల్ అప్నియా’ అనే సమస్యతో బాధపడుతుండవచ్చు. ప్రమాదకరం కాకపోవచ్చు కానీ ఇదొక చిన్నపాటి అనారోగ్య సమస్యగా పలువురు పేర్కొంటున్నారు. నిజానికి 2007లో లిండా స్టోన్(Linda Stone) అనే పేరుగల మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ కనుగొన్న పదం ఇది. ఒకప్పుడు మిలీనియల్స్‌లో ఎక్కువగా కనిపించే ఈ ప్రాబ్లం.. ఇప్పుడు జెన్ Z యువతలోనూ సాధారణమైపోయిందని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు వస్తుంది?
ప్రధాన కారణాలు ఏమిటంటే.. కంప్యూటర్, ఫోన్, గాడ్జెట్ ఏదైనా స్క్రీన్ ముందు పరిమితికి మంచి కూర్చోవడం, కూర్చునే భంగిమ (posture) సక్రమంగా లేకపోవడం, ముఖ్యంగా వంగినట్టు ఉండే భంగిమ వల్ల ఛాతీ ఒత్తిడికి గురవుతుంది. ఇది క్రమంగా ఊపిరి తీసుకోవడాన్ని కష్టంగా మారుస్తుంది. అలాగే ఈమెయిల్ లేదా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆసక్తి, ఆందోళన లేదా అనిశ్చితి వల్ల సడెన్‌గా శ్వాసను ఆపేసి సంబంధిత పనిలో టెన్షన్‌తో నిమ్నగమైపోతారు. ఆ సమయంలో కళ్లు స్క్రీన్ వైపు ఎక్కువసేపు చూడడం, పనిలో నిమగ్నమైపోవడం వల్ల అలసిపోయి శ్వాస విధానం కూడా ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 80% మందిని ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పని ఒత్తిడిలో మన నాడీ వ్యవస్థ ఇ-మెయిల్ లేదా నోటిఫికేషన్‌ను ఒక బెదిరింపు లేదా హెచ్చరిక సంకేతంగా భావించే పరిస్థతి శ్వాసను ఆపి, శరీరాన్ని టెన్షన్‌లో ఉంచుతుందని నిపుణులు అంటున్నారు.
హార్ట్‌రేట్ పెరుగుతుంది..
స్లోగా ఊపిరి తీసుకోవడం లేదా శ్వాసన బిగపట్టడం వల్ల శరీరం “ఫైట్ లేదా ఫ్లైట్” (fight or flight) మోడ్‌లోకి వెళ్తుంది. దీనివల్ల ఆందోళన, హార్ట్ రేట్ పెరుగుతాయని, జాయింట్లు, భుజాలు, దవడ టెన్షన్‌లోకి వెళ్తాయని నిపుణులు అంటున్నారు. ఇది రోజంతా కొనసాగితే అలసట, తలనొప్పి, కండరాల టెన్షన్, ఆందోళన, శరీరంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఒక విధంగా చెప్పాలంటే.. మెదడు ఇ-మెయిల్‌ను లేదా నోటిఫికేషన్ రాగానే ఏదో ప్రమాదం వెంటాడుతున్నట్లు భావిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు పెరిగి, ఆందోళన, అలసట, తలనొప్పి, రక్తపోటు పెరగడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
పరిష్కారం ఏమిటి?
ముందు లక్షణాలను గమనించడం (awareness) చాలా ముఖ్యం. ఇ-మెయిల్ ఓపెన్ చేసేముందు పూర్తిగా ఊపిరి పీలుస్తూ వదులుతూ.. కాళ్లు నేల మీద ఉంచి, శరీరాన్ని రిలాక్స్ చేయాలి. 5 సెకన్లు పీల్ చేసి 5 సెకన్లు ఎక్స్‌హేల్ చేసే “కోహెరెంట్ బ్రీతింగ్” వంటి సాధారణ వ్యాయామాలు సహాయపడతాయి. అలాగే పని మధ్యలో తప్పక బ్రేక్స్ తీసుకోవాలి. వాకింగ్ లేదా స్ట్రెచింగ్ కూడా మంచిదే. అయితే ఇ-మెయిన్ అప్నియా అనేది చాలా సాధారణ సమస్యే కాబట్టి, ఆందోళన, భయం అవసరం లేదంటున్నారు నిపుణులు. కాకపోతే దీర్ఘకాలికంగా కొనసాగితే నాడీ వ్యవస్థ రుగ్మతలకు, నిద్రలేమి, తలనొప్పి, వర్టిగో వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే లక్షణాలను బట్టి డాక్టర్లను సంప్రదించాలని నిపుణులను సంప్రదించాలి.






