పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి

by Ratna Kumari |

మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్–నార్కోటిక్ బృందం మెరుపు దాడి నిర్వహించింది.

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి
X

దిశ, మంథని : మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్–నార్కోటిక్ బృందం మెరుపు దాడి నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు గుంజపడుగు గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేపట్టారు.

ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.43,540 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పోలీసులను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం మంథని పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు.

Next Story