ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యం : మంత్రి అడ్లూరి

by Batti.Sumithra |

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యం : మంత్రి అడ్లూరి
X

దిశ, చైతన్యపురి : ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ అండ్ అమెనిటీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు, అవసరమైన అమెనిటీస్‌ను పంపిణీ చేసి మాట్లాడారు.

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నారని అభినందించారు. అండర్-16 విభాగంలో ఖేలో ఇండియా, స్కూల్ గేమ్స్ పోటీల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్, పున్న గణేశ్ నేత, బుడ్డ సత్యనారాయణ, చిలుక ఉపేందర్ రెడ్డి, కందికంటి శ్రీధర్ గౌడ్, స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీపార్వతి, వైస్ ప్రిన్సిపాల్ నర్సింహరెడ్డి, స్కూల్ సెక్రటరీ సాల్మాబాను తదితరులు పాల్గొన్నారు.

Next Story