- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు అలర్ట్.. రేపు సూళ్లకు నో హాలిడే!
by velandi.Saikiran |
రేపు ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు ఎలాంటి సెలవు లేదని అధికారులు ప్రకటించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు ఎలాంటి సెలవు లేదని అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో దాదాపు ప్రైవేట్ విద్యాసంస్థలకు హాలిడే ఇచ్చేశారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్ యథాతథంగా కొనసాగుతాయని ఏపీ విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు.
రేపు ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఆ తర్వాత క్లాసులు కూడా ఉండనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం అస్సలు కుదరదని.. అందుకే రేపు సెలవు ఎవరికీ ఉండబోదని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఏపీలోని ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ఇప్పటికే సమాచారాన్ని మెసేజ్ ల ద్వారా యాజమాన్యాలు తెలిపాయి.
Next Story






