కాళోజి యూనివర్సిటీలో రేపటి పరీక్షలు వాయిదా

by Muthe.Rajitha |   (  Updated:2026-07-23 18:32:36  IST  )

కాళోజీ నారాయణరావు వైద్యారోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) ఒక కీలక ప్రకటన జారీ చేసింది.

కాళోజి యూనివర్సిటీలో రేపటి పరీక్షలు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : కాళోజీ నారాయణరావు వైద్యారోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) ఒక కీలక ప్రకటన జారీ చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలో శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడిన ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రత్యేకంగా వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే, జులై 24న జరగాల్సిన పరీక్షలు తప్ప మిగిలిన రోజుల్లో జరగబోయే ఇతర పరీక్షలన్నీ ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి టైమ్‌టేబుల్ ప్రకారమే యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. కావున ఈ సమాచారాన్ని వెంటనే సంబంధిత విద్యార్థులందరి దృష్టికి తీసుకెళ్లాలని ప్రిన్సిపాళ్లను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Next Story