నీట్ పేపర్ లీకేజీ నిరసనలపై స్పందించిన సచిన్.. ఏమన్నాడంటే?

by Harish |

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు.

నీట్ పేపర్ లీకేజీ నిరసనలపై స్పందించిన సచిన్.. ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఎక్స్ వేదికగా కీలక పోస్టు పెట్టారు. తమ తగిన కష్టానికి ప్రతిఫలం లభించలేదని విద్యార్థులు నిరాశకు గురవడం సరైందేనని అన్నారు. ప్రతిభకే విజయం దక్కే సంస్కృతిని నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా తన తండ్రిని చెప్పిన మాటను సచిన్ గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న ఫ్రొఫెసర్. ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా ఉన్నారు. ఆయన చిన్నప్పుడే నేర్పిన ఒక పాఠం ఏంటంటే ‘ఓడిపోయినా పర్వాలేదు. కానీ చీటింగ్ చేయడం సరైంది కాదు. ఎప్పుడూ షార్ట్‌కర్ట్స్‌ను అనుసరించొద్దు’అని చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా ఆ సంస్కృతిని తీర్చిదిద్దే బాధ్యత మనపై ఉంది. కష్టం కంటే ఫలితాలకే ప్రాధాన్యతనిచ్చే సమాజం షార్ట్‌కర్ట్స్‌నే వెతుకుతుంది. విద్యార్థులు తమ కష్టానికి ప్రతిఫలం దక్కలేదని నిరాశ చెందడం అర్థం చేసుకోలిగిందే. ఇకపై వారికి అలా అనుకోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన యువ భారతం కలలు, శక్తితో నిండినది. యువత మన విజయానికి ఇంధనం. తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, బంధువులు, స్కూల్ నిర్వాహకులు మనమంతా ఒక సమాజంగా యువతరాన్ని ప్రోత్సహించాలి. కష్టానికి ఫలితం ఉంటుందని, నిజాయతీని ప్రోత్సహించాలని, ప్రతిభే గెలుస్తుందనే సంస్కృతిని రూపొందించాలి. మన పిల్లల భవిష్యత్తు, వారి కలలకు రక్షణ కల్పించడానికి ఒక పరిష్కారాన్ని కొనుగోంటామనే నమ్మకం నాకుంది.’అని సచిన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు.

గిల్ మద్దతు

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా నిరసనలకు మద్దతు తెలిపాడు. ‘యువ భారతీయుడిగా నేర్చుకోవడానికి, కలలు కనడానికి, మనం ఆకాంక్షించే భవిష్యత్తును తీర్చుదిద్దుకోవడానికి మన తరానికి ప్రతి అవకాశం లభించాలి. శాంతియుతంగా మన గళాన్ని వినిపించాలని విశ్వసించే యువతపై నాకు గౌరవం ఉంది. మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి విద్యకు ఉంది. మన దేశ భవిష్యత్తు కోసం దయతో, పరస్పర గౌరవంతో, ప్రతి విద్యార్థి శ్రేయస్సును మనసులో పెట్టుకుని ముందుకు సాగుదామని ఆశిస్తున్నా.’అని గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.


Next Story