Big Breaking News : NEET పేపర్ లీకేజీ..ప్రధాని మోడీ కీలక ప్రకటన

by Muthe.Rajitha |

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదిక ఓ కీలక వీడియో ప్రకటన చేసారు.

Big Breaking News : NEET పేపర్ లీకేజీ..ప్రధాని మోడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : నీట్(NEET-UG 2026) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) ఎక్స్ వేదిక ఓ కీలక వీడియో ప్రకటన చేసారు. పేపర్ లీకేజి అంశం సామాన్య విఐషయం కాదని, దీని వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. విద్యార్థులకు ఒక విద్యా సంవత్సరం నష్టపోతారని భావించి రీ ఎగ్జామ్ నిర్వహించామని తెలిపారు. ఈ ఘటనపై రేపు కేబినెట్ లో చర్చించి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. యువత భవిష్యత్తును కాపాడటం కంటే మరేదీ ముఖ్యం కాదన్నారు. ఈ నేరాలకు పాల్పడిన బాధ్యులకు అత్యంత వేగంగా, కఠినంగా శిక్ష పడేలా చూసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను (Fast-Track Courts) ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలులోకి తీసుకురావడానికి, అలాగే విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత శాఖలను, అధికారులను ఆదేశించామని మోడీ పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు, మన విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాల్లో ఇది మరొక కీలకమైన అడుగని, మన దేశ యువత యొక్క భవిష్యత్తుతో ఆడుకోవాలని చూసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని ప్రధాని తన వీడియోలో వెల్లడించారు.

Next Story