- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీ ఓరియెంటెడ్ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కథ రెడీ చేసిన ప్రముఖ డైరెక్టర్!
వైవిధ్యమైన కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తిరుమల కిషోర్.. ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి సిద్ధం అవుతున్నాడు

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తిరుమల కిషోర్.. ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి సిద్ధం అవుతున్నాడు. ఇది పూర్తి మహిళా ప్రధాన్య కథ మాత్రమే కాకుండా.. ఇందులో దైవిక అంశాలు, పురాణాల టచ్ కూడా ఉంటాయని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించేందుకు సాయిపల్లవిని అప్రోచ్ అయ్యాడట ఈ డైరెక్టర్. ఇప్పటికే ఈ నేచురల్ బ్యూటీకి కథ కూడా చెప్పగా.. కథలోని భావోద్వేగాలు, పాత్రకు ఉన్న ప్రాధాన్యం సాయిపల్లవికి నచ్చడంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించిన నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. కథ, పాత్రల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉండే సాయిపల్లవి.. ఇప్పుడు ఈ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పిందని ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతుండగా.. తిరుమల కిషోర్ సిద్ధం చేసిన ఈ దైవిక కథలో విషయం బలంగా ఉన్నట్టే అని భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకుండానే నెట్టింట హైప్ క్రియేట్ అవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.






