విద్యార్ధులపై లాఠీఛార్జ్.. కేంద్రంపై బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషీ ఫైర్

by Muthe.Rajitha |

విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పట్ల బీజేపీ సీనియర్ నేత, మాజీ మానవ వనరుల అభివృద్ధి (HRD) శాఖ మంత్రి మురళి మనోహర్ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

విద్యార్ధులపై లాఠీఛార్జ్.. కేంద్రంపై బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పట్ల బీజేపీ సీనియర్ నేత, మాజీ మానవ వనరుల అభివృద్ధి (HRD) శాఖ మంత్రి మురళి మనోహర్ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'క్రాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన 'ఛలో సంసద్' మార్చ్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. నీట్, ఇతర పోటీ పరీక్షల లీకేజీల వల్ల తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కేవలం శాంతిభద్రతల (Law and Order) సమస్య మాత్రమే కాదని, అవి అత్యంత న్యాయమైన డిమాండ్స్ అని స్పష్టం చేశారు. విద్యార్థులపై, ముఖ్యంగా యువతుల పట్ల పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించడం, వారిపై బ్రూటల్‌గా మిస్‌హ్యాండిల్ చేయడం వంటి దృశ్యాలను చూడటం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను బలప్రయోగంతో అణచివేయలేరని, వారి వేదనను ప్రజాస్వామ్య మార్గాల్లో మాత్రమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశ భవిష్యత్తుకు వెన్నుముకైన యువతపై ఇటువంటి కఠినమైన బలప్రయోగాలు చేయడం వల్ల, రాజ్యాంగ లక్ష్యమైన 'వికసిత్ భారత్' సాధన నుండి సమాజంలోని ఒక పెద్ద విభాగాన్ని దూరం చేసినట్లవుతుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని విద్యార్థులు మరియు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో, సొంత పార్టీకి చెందిన ఈ సీనియర్ దిగ్గజ నాయకుడి వ్యాఖ్యలు ప్రభుత్వానికి మింగుడుపడకుండా మారాయి.

Next Story