రెండో యూత్ టెస్టులో భారత్ అండర్-19 విక్టరీ.. మెరిసిన తెలుగు కుర్రాడు

by Harish |

శ్రీలంక అండర్-19తో జరిగిన రెండో యూత్ టెస్టులో భారత్ అండర్-19 జట్టు 211 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

రెండో యూత్ టెస్టులో భారత్ అండర్-19 విక్టరీ.. మెరిసిన తెలుగు కుర్రాడు
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక అండర్-19తో జరిగిన రెండో యూత్ టెస్టులో భారత్ అండర్-19 జట్టు 211 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలి టెస్టు డ్రా అయిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో నెగ్గడంతో సిరీస్‌‌ను కూడా భారత్ 1-0తో సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 411 రన్స్ చేసిన ఇండియా.. శ్రీలంకను 148 పరుగులకే కూల్చేసి 263 పరుగుల భారీ లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 208/3 వద్ద డిక్లేర్డ్ ఇచ్చి 472 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందు పెట్టింది. గురువారం 155/4తో చేజింగ్‌ను కొనసాగించిన శ్రీలంక 260 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో విమత్ దిన్సారా(64), సెనుజ వెకునగోడ(64), సెనెవిరత్నె(42) రాణించగా.. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. బౌలర్లు రోహిత్ యాదవ్ 4 వికెట్లు, చిగురపాటి వెంకట 3 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. చిగురపాటి వెంకట‌ది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా. అయితే అతను దేశవాళీలో గోవాకు ఆడుతున్నాడు.


Next Story