శుక్రవారం కూడా ఢిల్లీ మెట్రో సేవలు బంద్, ఇంటర్నెట్ కట్

by Muthe.Rajitha |

జూలై 24 ఉదయం 7:30 గంటల నుండి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది.

శుక్రవారం కూడా ఢిల్లీ మెట్రో సేవలు బంద్, ఇంటర్నెట్ కట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో క్రాక్‌రోచ్ జనతా పార్టీ (CJP), విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో అధికారులు రాజధాని నగరంలో కఠినమైన ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా జూలై 24 (శుక్రవారం) ఉదయం 7:30 గంటల నుండి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయాన్ని మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంచారు.

మరోవైపు, నిరసనలు తీవ్రరూపం దాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలతో పాటు ఎస్‌ఎంఎస్ (SMS) సేవలను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు వ్యాపించకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండటానికే ఈ 'ఇంటర్నెట్ షట్‌డౌన్' విధించినట్లు అధికారులు తెలిపారు. ఒకవైపు 17 మెట్రో స్టేషన్ల మూసివేత, మరోవైపు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో స్థానిక ప్రయాణికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Next Story