- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"మిస్టర్ మోడీ.. అతి తెలివి ప్రదర్శించకండి".. ప్రధాని ప్రకటనపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వీడియో ప్రకటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్ డెస్క్ : నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వీడియో ప్రకటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమస్య తీవ్రతను పక్కతోవ పట్టించేలా ప్రధాని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ X వేదికగా స్పందిస్తూ ప్రధాని మోడీ ని నేరుగా ప్రశ్నించారు. "మిస్టర్ మోడీ.. మీరు అతి తెలివి ప్రదర్శించకండి. నీట్ వ్యవహారంలో విద్యార్థులు స్పష్టమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు ఒక దయనీయమైన వీడియో విడుదల చేసి, వారి ఆవేదనను అవమానించకండి" అని మండిపడ్డారు. ఈ వరుస పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని పునరుద్ఘాటించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై విచక్షణా రహితంగా లాఠీఛార్జ్ చేసి దాడులకు పాల్పడిన పోలీసులపై, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులైన విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంటులో చర్చిస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ కాసేపటి క్రితం ఆ వీడియో ప్రకటన విడుదల చేసారు.






