మంచి పాత్ర వస్తే అప్పుడు ఆలోచిస్తా.. రీ ఎంట్రీపై సీనియర్ నటి కామెంట్స్

by Chukka Sudharani |

జబర్ధస్త్ ఫేమ్ అదిరే అభి (అభినయ కృష్ణ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కర్మాఖ్య’.

మంచి పాత్ర వస్తే అప్పుడు ఆలోచిస్తా.. రీ ఎంట్రీపై సీనియర్ నటి కామెంట్స్
X

దిశ, సినిమా: జబర్ధస్త్ ఫేమ్ అదిరే అభి (అభినయ కృష్ణ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కర్మాఖ్య’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒకప్పుడు స్టార్ హీరోయిన్, ప్రస్తుత రాజకీయ నేత విజయశాంతి ఆసక్తిక కామెంట్స్ చేశారు. ‘పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న చిత్రాలకు లభించే మద్దతు కాస్త తక్కువే అయినప్పటికీ, నిజమైన దమ్ము, కొత్తదనం, బలమైన కథలు చిన్న సినిమాల్లోనే ఉంటాయి. ప్రేక్షకులు ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలను ఆదరిస్తే పరిశ్రమకు మరింత మంది కొత్త నటీనటులు, దర్శకులు వస్తారు. ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలు నిలదొక్కుకోవాలంటే మీడియా సహకారం చాలా అవసరం. కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో మీడియానే కీలక పాత్ర పోషిస్తుంది’ అని తెలిపారు. అలాగే.. ఆమె నటన కెరీర్‌పై స్పందిస్తూ.. ‘ప్రస్తుతం నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నందున నటించే ఆలోచన లేదు. అయితే బలమైన కథ, గుర్తుండిపోయే మంచి పాత్ర వస్తే మాత్రం ఆలోచిస్తాను’ అని చెప్పుకొచ్చారు. కాగా.. కర్మాఖ్య చిత్రం జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Next Story