టీజర్, టైటిల్ లేదు.. ఓన్లీ పోస్టర్‌తో చేతులు దులిపేసుకున్న సూర్య 47 మేకర్స్

by Chukka Sudharani |

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య.. ఇప్పుడు ‘సూర్య 47’తో బిజీగా ఉన్నాడు.

టీజర్, టైటిల్ లేదు.. ఓన్లీ పోస్టర్‌తో చేతులు దులిపేసుకున్న సూర్య 47 మేకర్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య.. ఇప్పుడు ‘సూర్య 47’తో బిజీగా ఉన్నాడు. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నజ్రియ, ప్రేమలు ఫేమ్ నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య, జ్యోతిక కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సూర్య బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన బర్త్‌డే కావడంతో ఓన్లీ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు మేకర్స్. ఈ మేరకు ‘అద్భుత శక్తికి.. ఆ ఒక్కడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో సూర్య హ్యాండ్ మాత్రమే కనిపిస్తుండగా.. రక్తంతో తడిచిన చేతిలో లాలీపప్‌ను హైలెట్‌గా చూపించారు. ఇక పోస్టర్ వైరల్ అవుతుండగా.. టైటిల్, టీజర్ వస్తుంది అనుకుంటే పోస్టర్‌తో సరిపెట్టారా అంటూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story