ఆ టైమ్‌లో నొప్పిని తట్టుకోలేకపోయా.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సినీ న‌టి, మోడ‌ల్ తేజ‌స్విని కోల్హాపురి.. ప్రెగ్నెన్సీ కోసం ఐవీఎఫ్ చేయించుకున్న తీరుపై ఆమె హృద‌య‌విదార‌క‌ర ప‌రిస్థితిని వివ‌రించింది.

ఆ టైమ్‌లో నొప్పిని తట్టుకోలేకపోయా.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సినీ న‌టి, మోడ‌ల్ తేజ‌స్విని కోల్హాపురి.. ప్రెగ్నెన్సీ కోసం ఐవీఎఫ్ చేయించుకున్న తీరుపై ఆమె హృద‌య‌విదార‌క‌ర ప‌రిస్థితిని వివ‌రించింది. ‘ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో పిల్ల‌లు క‌నేందుకు చాలా ఇబ్బందిప‌డ్డాను. ఇందులో దాచుకోడానికి ఏం లేదు ఓపెన్‌గానే చెప్తాను. మొత్తం ఐదు సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నారు. మొదటిసారి, రెండోసారి అయితే తీవ్ర‌మైన మాన‌సిక‌, శారీర‌క బాధ‌ను అనుభ‌వించాల్సి వచ్చింది. ఇక ఆ త‌ర్వాత మూడు, నాలుగు, అయిదోసారి ప‌ర్వాలేద‌నిపింది. అది చేయించుకోవడానికి మాన‌సికంగా చాలా ధైర్యంగా ఉండాల‌ి. ఇంజెక్ష‌న్ల కోసం ప్ర‌తిసారి క్లినిక్‌ల‌కు వెళ్లాల్సి వ‌స్తుంది. చాలా నొప్పిని తట్టుకోవాల్సి వ‌స్తుంది. అయితే.. నేను మాన‌సికంగా ధైర్యంగా ఉన్నాను కానీ శారీర‌కంగా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. వంద‌ల సంఖ్య‌లో ఇంజెక్ష‌న్లు తీసుకోవ‌డం వ‌ల్ల నా బాడీ షేప్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రెగ్నెన్సీ ఓకే అయిన త‌ర్వాతే ఆ ఇంజెక్ష‌న్ల‌ు ఆపేస్తారు. ఐదు సార్లు ఐవీఎఫ్‌కు వెళ్తే.. ఐదోసారి ల‌క్కీగా జ‌రిగింద‌న్నారు. మ‌ధ్య‌లో రెండు సార్లు మిస్ క్యారేజ్ అయ్యింది’ అని తెలిపారు. కాగా.. ఫిల్మ్‌మేక‌ర్‌, న‌టుడు పంక‌జ్ స‌ర‌స్వ‌త్‌ను తేజ‌స్విని కొల్హాపురి పెళ్లి చేసుకోగా.. పెళ్లి అయిన 8 ఏళ్ల‌కు ఇద్దరు ఆడపిల్లలు సంతానం క‌లిగింది.

Next Story