- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిరుదొడ్డిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం సిద్దిపేటలో అదృశ్యమైన ఓ వ్యక్తి గురువారం తన సొంత గ్రామమైన మిరుదొడ్డి మండల కేంద్రంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, మిరుదొడ్డి : కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం సిద్దిపేటలో అదృశ్యమైన ఓ వ్యక్తి గురువారం తన సొంత గ్రామమైన మిరుదొడ్డి మండల కేంద్రంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి గ్రామానికి చెందిన చెక్క రవి అలియాస్ రహమాన్ (45) మతాంతర వివాహం చేసుకుని, భార్య, పిల్లలతో కలిసి సిద్దిపేటలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం భార్యతో తీవ్రంగా గొడవపడిన రవి ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. కాగా, గురువారం మిరుదొడ్డిలోని నాగయ్య వాగు వద్ద ఓ చెట్టుకు వ్యక్తి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, అది పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మృతుడు నాలుగు రోజుల క్రితం సిద్దిపేటలో అదృశ్యమైన చెక్క రవేనని పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.






