- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది.. ‘చెన్పై లవ్ స్టోరీ’పై చిరంజీవి కామెంట్స్
by Chukka Sudharani |
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా, రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.

X
దిశ, సినిమా: హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా, రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘చెన్నై లవ్ స్టోరీ టైటిల్ వినగానే నాకు చెన్నైతో ఉన్న అనుబంధం, ప్రేమ గుర్తుకువచ్చాయి. ఎస్ కేఎన్, సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం, మణిశర్మ.. ఇలా వీళ్లంతా నా మీద పెంచుకున్న అభిమానం, ప్రేమ నన్ను ఈ వేదిక మీద నిలబడేలా చేశాయి. నా అభిమానులను ఇష్టపడతాను.
నా అభిమానులు ఎదిగితే ప్రాణప్రదంగా చూసుకుంటాను. నన్ను అభిమానించడమే కాదు మీరు ప్రయోజకులై, మీ కుటుంబానికి, సమాజానికి పేరు తీసుకొచ్చి, అందరూ గర్వపడేలా చేస్తే అదే నాకు నిజమైన సంతోషం. అదే నాపై మీరు చూపించే నిజమైన ప్రేమగా భావిస్తాను. అలాంటి అభిమానులను చూసి ముచ్చటపడుతుంటాను. ఈ వేదిక మీద అలాంటి అభిమానులను చూసి ఆనందానికి లోనవుతున్నాను. ఏదో పిలిచారు కదా అని ఈవెంట్‌కు వచ్చి విశెస్ అందించి వెళ్లిపోవడం కాదు మీ అభిమానం తాలుక వైబ్రేషన్ అనుభవించాలని, మనస్ఫూర్తిగా ఈ టీమ్‌ను ప్రోత్సహించాలని వచ్చాను. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన కిరణ్.. చెన్నై లవ్ స్టోరీతో ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరిని ఆల్ ది బెస్ట్’ అని తెలిపారు.
Next Story






