- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిచ్చా సుదీప్ ‘బిల్లా రంగా భాషా’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘హనుమాన్’తో ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ సొంతం సంపాదించుకున్న టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాబోతున్న చిత్రం ‘బిల్లా రంగా భాషా’.

దిశ, సినిమా: ‘హనుమాన్’తో ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ సొంతం సంపాదించుకున్న టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాబోతున్న చిత్రం ‘బిల్లా రంగా భాషా’. ఇందులో కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టును 2024లో ప్రకటించినప్పటికీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. దీంతో అసలు ఈ సినిమా ఉందా లేదా అనే ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా విడుదలపై అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని 2027 అక్టోబర్ 27న ఘనంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. నిర్మాణ పనులను సజావుగా కొనసాగిస్తూ, 2027 జనవరి నాటికి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుండగా.. BRB అభిమానుల కోసం ఆశ్చర్యకరమై న పుట్టినరోజు కౌంట్‌డౌన్ అధికారికంగా మొదలు కాగా.. ఇకపై బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా.. భారతీయ సినిమాల్లో అరుదుగా కనిపించే పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచాన్ని భారీ విజువల్ స్కేల్‌తో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నారు చిత్ర బృందం.






