అత్త, భర్త వేధింపులతో ఉరివేసుకొని గృహిణి ఆత్మహత్య

by Batti.Sumithra |

భర్త, అత్త వేధింపులు తట్టుకోలేక గృహిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం జరిగింది.

అత్త, భర్త వేధింపులతో ఉరివేసుకొని గృహిణి ఆత్మహత్య
X

దిశ, రాజేంద్రనగర్ : భర్త, అత్త వేధింపులు తట్టుకోలేక గృహిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన మహిపాల్, శ్రీదేవి (25) లకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి సంతానం. బతుకు తెరువు కోసం ఈమధ్య బండ్లగూడ జాగిర్ లోని ఆదర్శ కాలనీకి వచ్చి నివాసం ఉంటు భార్యాభర్తలు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ మధ్య భర్త గొడవలు పడుతుండడంతో పాటు అత్త వేధింపులు అధికం అయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన శ్రీదేవి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story